పాటల్లో నెల్లూరి పెద్దారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సతీష్‌రెడ్డి, వౌర్యాని, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా వి.జె.రెడ్డి దర్శకత్వంలో సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సిహెచ్. రఘునాధరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. గురురాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు సాగర్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.జె.రెడ్డి మాట్లాడుతూ- పల్లె వాతావరణంలో ఆహ్లాదకరమైన కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. నెల్లూరునుంచి ఖమ్మం జిల్లా సీతారాంపురం అనే గ్రామానికి వలస వచ్చిన పెద్దారెడ్డి అనే వ్యక్తి కథ. ఆ గ్రామం వారంతా ఆయన్ను నెల్లూరు పెద్దారెడ్డి అని పిలుస్తూ వ్యవహరిస్తుంటారు. నలుగురికి మంచిచేసే పెద్దారెడ్డి జీవితంలో అనుకోని మలుపులు సంభవిస్తాయి. అవి ఏంటన్నదే ఈ సినిమా. ప్రేక్షకులను నవ్వించే కామెడీతో వస్తున్నాం. త్వరలోనే ఫస్ట్ కాపీ సిద్ధవౌతుంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. హీరో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ- నెల్లూరు పెద్దారెడ్డి పేరు చెప్పగానే బ్రహ్మానందం గుర్తొస్తాడు. అలాంటి గొప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నందుకు ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు సాగర్ మాట్లాడుతూ- మంచి అవగాహనతో సినిమా తీశారని అర్థమవుతోంది. ఈ రోజుల్లో దర్శక నిర్మాతలకు కావాల్సింది అదే. మంచి చిత్రం చేయడం కోసం ఆరు నెలలు వేచి చూసినా నష్టం లేదు. తప్పకుండా ఈ చిత్ర యూనిట్‌కు నా సపోర్టు వుంటుంది అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ- ప్రస్తుతం సినిమాల విషయంలో నిర్మాతలకు భారం ఎక్కువవుతోంది. అయినా సరే కథమీద నమ్మకంతో మంచి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్న ఇలాంటి నిర్మాతలను ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అన్నారు. ఈ చిత్రానికి మాటలు:సంజీవ్ మేగోటి, కెమెరా:బాలసుబ్రమణియన్, ఎడిటింగ్:మేనగ శ్రీను, సంగీతం:గురురాజ్, నిర్మాత:రఘునాథరెడ్డి, దర్శకత్వం:వి.జె.రెడ్డి.