భాగమతి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశి ప్రమోద్ నిర్మించిన భాగమతి చిత్రం శుక్రవారం విడుదలై భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుని సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు అశోక్ మాట్లాడుతూ- అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి చిత్రం నిన్న విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. స్టార్ హీరోలకు ధీటుగా అనుష్క భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టడం ఆనందంగా వుంది. ముఖ్యంగా రెండవ షోకే థియేటర్లను భారీగా పెంచుకున్న సినిమా ఇదే. అనుష్క నటన ప్రధాన ఆకర్షంగా నిలిచింది. అన్నిరకాల టెక్నికల్ హైలెట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా మహిళలనుండి ఆదరణ రెట్టింపు అయింది. భాగమతిగా అనుష్క పాత్రలో జీవించింది. మేం ఊహించినదానికన్నా రెట్టింపు రెస్పాన్స్‌తో అటు ఓవర్సీస్‌లో కూడా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.