ఆలోచింపజేసే ‘శీలవతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ సూపర్‌స్టార్ అయిన షకీల ముఖ్యపాత్రలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో జీ స్టూడియోస్ పతాకంపై రాఘవ.ఎం, గణేశ్, వీరూ బాసింశెట్టి నిర్మాతలుగా రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ శీలవతి. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఓ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న షకీల నటిస్తున్న 250వ చిత్రం ఇది. కేరళలో జరిగిన ఓ యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. మా నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమా అనుకున్నదానికంటే అద్భుతంగా వచ్చింది. సంగీతానికి ప్రాధాన్యత వుంది. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది అన్నారు. నిర్మాత గణేశ్ మాట్లాడుతూ- ఊహించినదానకంటే సినిమా బాగా వచ్చింది. నేటినుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. మరో నిర్మాత వీరు మాట్లాడుతూ- పిఆర్‌ఓగా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా చేసిన నేను ఈ చిత్రంతో మళ్లీ నిర్మాతగా మారుతున్నందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. షకీల, గీతాంజలి, లడ్డు, అశోక్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ప్రజ్వల్ క్రిష్, కెమెరా:తరుణ్ కరమ్‌తోత్, నిర్మాతలు:రాఘవ, గణేశ్, వీరు బాసింశెట్టి, దర్శకత్వం:సాయిరామ్ దాసరి.