ఆ ప్రభావం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడిగా సంగీత రంగంలోకి ప్రవేశించి మొదటి చిత్రంతోనే సంగీత దర్శకుడిగా తనదైన ముద్రను కనబరిచాడు సాగర్ మహతి. ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న చిత్రం ‘్ఛలో’. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు సాగర్ మహతి చెప్పిన విశేషాలు... ‘్ఛలో’ చిత్రంలోని మొదటి పాటకు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా వుంది. చాలామంది ప్రేక్షకులతోపాటు సినీ పెద్దలు కూడా అభినందిస్తున్నారు. స్వతహాగా నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. దర్శకుడు వెంకీ మంచి కథతోపాటు సన్నివేశాలను ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ కుదిరింది. నాపై నాన్నగారి ప్రభావం వుండదు. ఎందుకంటే నాకంటూ 99 శాతం భిన్నమైన ట్రెండ్‌ను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని విషయాల్లో నాన్న సపోర్టు తీసుకుంటాను. నాన్నకు మెలోడీ బ్రహ్మగా పేరుంది. ఆయన మెలోడీ సాంగ్స్‌కు పెట్టింది పేరు. కానీ నాకు మాత్రం మంచి ఫీల్ వున్న ప్రేమకథలకు మ్యూజిక్ చేయాలని, అలాగే అన్ని రకాల సంగీతాన్ని అందించాలన్న కోరిక ఉంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ సంగీతం ఏ సినిమాకైనా కీలకమే. దానికి సపరేట్ విభాగం. ఇందులో చాలా ఆసక్తి వుంటే తప్ప రీ రికార్డింగ్ చేయలేం. ఎందుకంటే సెన్సిబులిటీ ముఖ్యం. సన్నివేశాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వుండాలి. మామూలుగా సినిమాలకు పాటలు ఎవ్వరైనా చేయవచ్చు. ఇక సంగీత దర్శకుడిగా నాకు యువన్ శంకర్‌రాజా ఆదర్శం. ఎందుకంటే లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా తనయుడైన యువన్, ఒక్క పర్సెంట్ కూడా తండ్రి శైలి లేకుండా స్వంతంగా ఇమేజ్‌ని సృష్టించుకున్నాడు. నేను కూడా అలాగే చేయాలని వుంది. నేను 160 చిత్రాలకు పలువురు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. ఈ చిత్రంలో నాగశౌర్య, రష్మికల జంట ఆకట్టుకుంటుంది. యూత్ ఫీలింగ్‌తో మ్యూజిక్ కుదిరింది. సంగీత దర్శకుడిగా ఇది నాకు మూడవ చిత్రం. మంచి కథలతోవచ్చే చిత్రాలకు సంగీతం అందించాలని వుంది. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కుతున్న ‘కుమారి 21ఎఫ్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నా. తెలుగులో రెండు మూడు చిత్రాల చర్చలు జరుగుతున్నాయి.