చిట్టిబాబు కోటి వ్యూస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రం రోజురోజుకీ అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫొటోలు, టీజర్ దుమ్మురేపుతున్నాయి. తాజాగా రంగస్థలం టీజర్ విడుదలై కేవలం 25 గంటల్లో కోటి వ్యూస్‌ను దాటడం విశేషం. టాలీవుడ్‌లో బాహుబలి తరువాత ఆ రేంజ్‌లో వ్యూస్ సాధించిన చిత్రమిది. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ కేవలం 29 గంటల్లో కోటి వ్యూస్‌ను దాటి సంచలనం రేపింది. ఇప్పుడు ఆ రికార్డును చరణ్ అధిగమించేశాడు. రామ్‌చరణ్ కొత్తగా కనిపించనున్న ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోందట. రామ్‌చరణ్ కెరీర్‌లోనే భిన్నమైన పాత్రతో ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. రంగ స్థలం అనే గ్రామంలో 1985 నేపథ్యంలో జరిగిన కథతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.