నారా రోహిత్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొటీన్‌కు భిన్నంగా వైవిధ్యమైన కథ, కథనాలను ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్ తాజాగా ఈ.ఎం.వి.ఈ స్డూడియోస్ సంస్థలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రొడక్షన్ నెం.3గా ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ సంస్థలో నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ఎస్.డి.చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలవ్వనుంది. వడ్డేపల్లి సత్యనారాయణ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో నారా రోహిత్ క్యారెక్టరైజేషన్, గెటప్ చాలా టిపికల్‌గా ఉండబోతోందట. ప్రస్తుతం తమ ప్రొడక్షన్‌లో రూపొందిన ‘హౌరా బ్రిడ్జ్’ విడుదలలో బిజీగా ఉన్న నిర్మాణం బృందం.. సినిమా విడుదవ్వగానే నారా రోహిత్ సినిమాకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాలను వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, సమర్పణ: వడ్డేపల్లి సత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.డి. చక్రవర్తి, నిర్మాణం: ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్.