టచ్ చేసి చూడు పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రమిది. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్‌కపూర్ కథానాయికలు. ఫిబ్రవరి 2న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు వి.వి.వినాయక్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ - ‘జామ్ 8 వండర్‌ఫుల్ మ్యూజిక్‌ని అందించారు. రామ్-లక్ష్మణ్, వెంకట్, రవివర్మ, అన్బు అరివు, పీటర్ హెయిన్స్ అందరూ మంచి యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు. రాశీఖన్నా, సీరత్‌కపూర్ ఎంత అందంగా ఉంటారో, అంతే అందమైన నడవడిక ఉన్నవారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి నా నిర్మాతలు బుజ్జి, వల్లభనేనిలకు బాగా డబ్బులు రావాలి. ‘మిరపకాయ్’ నుండి విక్రమ్‌తో నాకు మంచి పరిచయం ఉంది. మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. సినిమాను అద్భుతంగా తీశాడు. వక్కంతం చాలా మంచి కథను అందించాడు. ఈ సినిమాతో మనకు మంచి దర్శకుడు రాబోతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా విక్రమ్‌దే. ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అన్నారు. దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ - ‘వినాయక్‌గారు నాకు ఫిల్మ్ గురు. చాలా మంచి విషయాలను ఆయన్నుండి నేర్చుకున్నాను. నా సినిమాలు బావుండాలని కోరుకోవడం సహజం. అలాగే నా తల్లిదండ్రులు సహా నా కుటుంబ సభ్యులకు థాంక్స్. నా స్నేహితులు నా సినిమా కోసం ఎంతో సహకరించారు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ గారికి థాంక్స్. బుజ్జిగారు, వక్కంతం వంశీగారి కథ విన్న తర్వాతే సాధ్యమైంది. వక్కంతం వంశీ అద్భుతమైన కథను అందించారు. సంగీతం అందించిన జామ్ 8, నేపథ్య సంగీతం అందించిన మణిశర్మలకు కృతజ్ఞతలు. ఛోటాగారు ననె్నంతో ఇన్‌స్పైర్ చేశారు. డాలి, హరీశ్‌లకు థాంక్స్. రాశీఖన్నా, సీరత్‌కపూర్‌లు గ్లామర్‌తోనే కాదు, నటనతో కూడా మెప్పించారు. ఎనర్జీని ఆయన తన నుండి మరొకరికి ఇచ్చే వ్యక్తి రవితేజగారు. మనిషి లైఫ్‌లో అద్భుతాలు జరుగుతుంటాయి. నా లైఫ్‌లో జరిగిన అద్భుతం మాస్ మహారాజ్. అలాంటి హీరోతో నేను డైరెక్టర్‌గా పరిచయం కావడం నా అదృష్టం. ఈ టైటిల్‌లో ఎలాంటి పవర్ ఉంటుందో సినిమాలో కూడా అంతే పవర్ ఉంటుంది.
చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’ అన్నారు. వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ‘ నిర్మాతలు బుజ్జి, వల్లభనేని వంశీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా దర్శకుడు విక్రమ్ నాతో కలిసి పనిచేశాడు. సినిమాలో రెండు రీళ్లు చూశాను. సినిమాను విక్రమ్ ఎంతో అద్భుతంగా తీశాడు. ఛోటా, గౌతంరాజు సహా అందరికీ కంగ్రాట్స్. బావ (రవితేజ)కి పుట్టిన రోజు వయస్సు తగ్గుతూ వస్తుంది. విక్రమార్కుడు సినిమా చూసి ఎలా ఫీలయ్యామో, ఈ సినిమా చూసినప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతాం. రవి చాలా ఎనర్జితో, టఫ్‌గా చేశాడు. యూనిట్ అందరికీ శుభాకాంక్షలు’ అన్నారు. జెమిని కిరణ్ మాట్లాడుతూ - ‘రాజా ది గ్రేట్ ఏం టచ్ చేసినా అది సూపర్‌హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా సూపర్‌హిట్ కావాలి’ అన్నారు.