బంగారి బాలరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంది క్రియేషన్స్ బ్యానర్‌పై కె.ఎం.డి రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా ‘బంగారి బాలరాజు’ చిత్రంతో పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గ్లిట్టర్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి విడుద చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ - బంగారి బాలరాజు టీజర్ చూశాను. చాలా బాగుంది.
కొత్తగా వస్తున్న ఈ చిత్రం ప్రొడ్యూసర్స్ రఫీకి, రాఘవేంద్రరెడ్డికి, దర్శకుడు కోటేంద్రకి, హీరో రాఘవ్‌కు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాతలైన కె.ఎం.డి రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ - సురేందర్‌రెడ్డి లాంటి ప్రముఖ దర్శకుల చేతుల మీదుగా మా సినిమా టీజర్ విడుదలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చిరంజీవి చిత్రం ‘సైరా‘తో బిజీగా వున్నా మాకు సమయమిచ్చి టీజర్‌ని విడుదల చేసిందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్నారు. దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ - మా బంగారి బాలరాజు చిత్రం గ్లిట్టర్‌ని పెద్ద మనసుతో విడుదల చేసిన సురేందర్‌రెడ్డికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మాలాంటి కొత్త దర్శకులకు సురేందర్‌రెడ్డి ఆదర్శంగా ఉంటూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర థియేటరికల్ ట్రైలర్‌ని ఫిబ్రవరి 14న, సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
రాఘవ్, కర్యాణ కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, ఎన్.వి చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్.పి, జబర్దస్త్ బాబి, బి.వి చౌదరి, సుదర్శన్ దోర్నాల్, జయ భారత్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ- చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా: జి.ఎల్.బాబు, ఆర్ట్: కృష్ణమాయ, కో-డైరెక్టర్: హేమంత్‌కుమార్, నిర్మాతలు: కె.ఎం.డి.రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోటేంద్ర దుద్యాల.