‘ఎందుకో ఏమో’ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్వి హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తున్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ... ‘ఎందుకో ఏమో’ టైటిల్ లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు అన్నారు. దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ... ‘ఎందుకో ఏమో’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నా. ఎంతో బిజీ షెడ్యూల్‌లో కూడా మా చిత్రం టీజర్ ఆవిష్కరించిన దర్శకుడు వి.వి వినాయక్‌కు కృతజ్ఞతలు. నందు, నోయల్, పునర్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ముక్కోణప్రేమకథ. మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా పూర్తి స్వేచ్ఛనివ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగాం. నిర్మాత మాలతి వద్దనేని మాట్లాడుతూ- ‘‘మహేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై ఇది మా తొలి సినిమా. వినాయక్ చేతుల మీదుగా మా చిత్రం టీజర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఏ విషయంలో రాజీపడకుండా సినిమాను నిర్మించాం. మంచి లవ్‌స్టోరీతోపాటు కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. మా యూనిట్ అంతా పూర్తి సహకారం అందించడంతో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాం అన్నారు.