ఇంటిలిజెంట్‌గా మెప్పిస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 9న సిద్ధమైన సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ చెప్పిన విశేషాలు...
ఇటీవలే విడుదలైన టీజర్, పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోం ది. ముఖ్యంగా బాలకృష్ణ, ప్రభాస్‌లు ఈ సినిమా టీజర్‌ను, పాటలను విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ఏడాదిలో జై సింహాతో మంచి విజయాన్ని అందించారు. అదే ఉత్సాహంతో ఇంటిలిజెంట్‌గా వస్తున్నాం. ఖైదీ నెం 150 లాంటి భారీ విజయం తరువాత వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 4న రాజమండ్రిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుతున్నాం. వినాయక్ డబ్బులకోసం ఏదిపడితే అది చేయడు. మంచి కమిట్‌మెంట్ వుంటేనే సినిమా చేసే వ్యక్తి. ఇంటిలిజెంట్ సినిమాను అద్భుతంగా తీశాడు. ఇక సాయిధరమ్ తన మేనమామలా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఆయన కెరీర్‌లో గొప్పగా నిలిచిపోయే చిత్రం ఇది. ఇప్పటికే పరిశ్రమ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తేజ్ ఈ చిత్రంలో నటనతోను, డాన్సులతోను అదరగొట్టాడు. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసే చిత్రమిది. చమ్మక్ చమ్మక్ అనే వీడియో సాంగ్‌ను ఇళయరాజాగారు విడుదల చేస్తారు. ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడింది. పాటలకే కాదు ఫైట్స్ కోసం కూడా సెట్స్ వేశాం. అన్నీ గొప్పగా వుంటాయి. ఈ సినిమాతోపాటు విడుదలవుతున్న చిత్రాలు కూడా మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నేను ఈ రోజు నిర్మాతగా ఈ స్థాయిలో వున్నానంటే కారణం- మా గురువు దాసరిగారు. ఇక ఈ సినిమా తరువాత రానాతో 1945 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సుభాష్ చంద్రబోస్ నేపథ్యంలో వుంటుంది. అలాగే కొత్త దర్శకుడితో భారతి అనే సినిమా చేస్తాను. అలాగే వినాయక్‌తో మరో సినిమా కూడా వుంటుంది అన్నారు.