ప్రేక్షకుల మైండ్‌సెట్ మారుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజాగా టాలీవుడ్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న రవితేజ ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. రవితేజ సినిమా అంటే సదరు ప్రేక్షకుడికి సందడిలా వుంటుంది. అందుకే ఆయనకు అభిమానులు కూడా ఎక్కువే. రవితేజ ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ చిత్రంతో ముందుకు వస్తున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 2న విడుదలవుతున్న సందర్భంగా రవితేజ చెప్పిన విశేషాలు...
టచ్ చేస్తే..
టచ్ చేస్తే షాక్ తగులుతుందా? అనేగా మీ డౌట్! అది తెలియాలం టే రేపటిదాకా ఆగాల్సిందే. ఈ చిత్రంలో నేను పోలీసుగా కనిపిస్తాను. ఇదివరకు కూడా పోలీసు పాత్రల్లో నటించాను. అయితే ఈ పాత్ర నాకే చాలా కొత్తగా అనిపించింది. చిన్న ఫన్‌తోపాటు ఎమోషన్ వుంటుంది. వ్యంగ్యం వుంటుంది. ఓ వైపు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూనే మరోవైపు డ్యూటీ మైండెడ్‌గా వుంటాడు. దర్శకుడు అద్భుతంగా డీల్ చేశాడు.
విక్రమ్‌తో..
దర్శకుడు విక్రమ్ కొత్తగా పరిచయమవుతున్నాడు. తను చాలా అనుభవం వున్న వ్యక్తి. వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. మిరపకాయ్ సినిమా సమయం నుండీ నాకు పరిచయం. మంచి కమిట్‌మెంట్ వున్న వ్యక్తి. కథ చెప్పినదానికన్నా అద్భుతంగా తీశాడు. ఈ కథ విషయంలో నాకు ఒక్క పాయింట్ అని కాదు కథ మొత్తం నచ్చింది.
హీరోయిన్లతో..
ఇందులో సీరత్‌కపూర్, రాశీఖన్నాలు నటించారు. ఇద్దరి పాత్రలు బావుంటాయి. సీరత్ అల్ట్రా మోడరన్‌గా ఉంటుంది. అలాగే రాశీఖన్నా పాత్ర కామెడీ వేలో ఎంటర్‌టైన్ చేస్తుంది.
మ్యూజిక్ ట్రెండ్
ఈ సినిమాకు ప్రీతమ్ జామ్ 8 అనే ఓ కంపెనీ పెట్టాడు. అందులో వాళ్ల టీమ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అందులో నుంచి ఎంచుకున్న పాటలివి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మణిశర్మ ఇచ్చాడు. తను అందులో మాస్టర్.
కొత్తదనం కోసం
కొత్తదనం కోసం ఆలోచిస్తే సినిమాలు ఆడడంలేదు. నేను కొత్తగా చాలా సినిమాలు చేశా కానీ అవి ఏవీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఆటోగ్రాఫ్ ఎంత మంచి సినిమా. అలాగే నేనింతే, ఈ అబ్బాయి చాలా మంచోడు లాంటి సినిమాలన్నీ నిరాశ మిగిల్చాయి. కాబట్టి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంటే బెటర్.
ప్రయోగాలు..
ప్రయోగాలు చేయనని చెప్పడంలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారుతోంది. ఆటోగ్రాఫ్ సిని మా ఇప్పుడు వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని నా ఫీలింగ్. మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తా.
ఇతర భాషల్లో..
ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ఈ విషయంలో రాజవౌళికి థాంక్స్‌చెప్పాలి. నాకు కూడా ఇతర భాషల్లో సినిమాలు చేయాలని వుంది. తప్పకుండా అలాంటి స్క్రిప్ట్ వస్తే చేస్తా.
దర్శకత్వం..
తప్పకుండా దర్శకత్వం చేసే ఆలోచన వుంది. దానికి ఇంకా టైమ్ పడుతుంది. ఆ సినిమాలో నేను హీరోగా చేయను.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాను. దాంతోపాటు శ్రీను వైట్లతో ఓ చిత్రం ఉంటుంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్