అ! ట్రెండ్ సెట్ చేస్తుంది దర్శకుడు రాజవౌళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై కాజల్, రెజీనా, ఇషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు రాజవౌళి ట్రైలర్‌తోపాటు పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ట్రైలర్ చూడగానే చాలా ఆసక్తి కలిగింది. సినిమా కూడా సూపర్‌హిట్ అవుతుంది. నాని కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నాని అంటేనే ఖచ్చితంగా హిట్ అనే ఫీలింగ్ కలిగింది. దీన్ని దాటి మరో అడుగు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. రెజీనా లుక్ చూడగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన అందరినీ చూస్తుంటే చాలా ఆసక్తిగా వుంది. తప్పకుండా ట్రెండ్ సెట్ చేస్తుంది అన్నారు. నాని మాట్లాడుతూ- ఇదొక తిక్క సినిమా. మనలో కాస్త తిక్క వుంటుంది. ఆ తిక్కను శాటిస్‌ఫై చేసే సినిమా ఇది. హీరోగా నాని సినిమా చేస్తున్నాడు, మళ్లీ ఇదెందుకు అని చాలామంది అన్నారు. నిర్మాతగా చేయడం లాభసాటిగా వుండదని కూడా చెప్పారు.
ఈ చిత్రాన్ని నిర్మించడంవల్ల నిర్మాతలపై నాకు గౌరవం పెరిగింది. నిర్మాతలందరికీ హ్యట్సాఫ్. ప్రశాంత్ చెప్పిన కథ చాలా కొత్తగా వుంది. అందుకే నిర్మాతగా మారాను. ఇలాంటి కథను నేను వర్కవుట్ చేయకపోతే తెలుగులో కొత్త సినిమాలు రావనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ- ఈ అవకాశం ఇచ్చిన నానికి స్పెషల్ థాంక్స్. నేను చేసిన షార్ట్ ఫిలిం చూసి ఇలాంటి క్రేజీ థాట్ ఏదైనా వుంటే చెప్పమన్నాడు. అప్పుడు చేప పాత్ర కోసం వాయిస్ ఓవర్ కావాలని ఆయన్ను అడిగాను. ఆ తరువాత నాని కథ విని ఎగ్జైట్ అయ్యాడు. ఆయన రావడంతో సినిమా భారీగా మారిపోయింది. ఈ సినిమా కోసం ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. టైటిల్ కూడా నా కథకు వచ్చిన రెస్పాన్స్‌ను పెట్టాము. ఈనెల 16న విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాజల్, రెజీనా, నిత్యామీనన్, శ్రీనివాస్ అవసరాల, కీరవాణి, ప్రియదర్శి, ఈషా తదితరులు పాల్గొన్నారు.