అవసరాలతో..నాని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరికంటే స్పీడ్‌గా సక్సెస్‌లతో దూసుకుపోతున్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అందరూ నాని అని చెప్పేస్తుంటారు. ప్రస్తుతం ఈ హీరో చేస్తోన్న సినిమా లుచాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. అందుకే నిర్మాతలు, దర్శకులు నాని కాల్షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ వెయిటింగ్ లిస్ట్‌లో ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ కూడా ఉన్నారట. నటుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించిన శ్రీనివాస్ ఊహలు గుసగుస లాడే సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే శ్రీనివాస్ నాని కోసం ఒక మంచి కథను సిద్ధం చేశాడట. గత కొంత కాలం నుంచే ఈ విషయాన్ని చెప్పినా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనే మ్యాటర్ మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక శ్రీనివాస్ కానె్సప్ట్‌ను నాని ఈ ఇయర్‌లోనే స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా సోషల్ మీడియాలో న్యూ ప్రాజెక్ట్ గురించి నాని వివరించనున్నాడు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.