భిన్నమైన ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్‌రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా వింగ్స్ మూవీ మేకర్స్ పతాకంపై పూర్ణానంద్ దర్శకత్వంలో ప్రతిమ.జి నిర్మిస్తున్న చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌భవ’. ఈ చిత్ర పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కార్తీక్‌రాజ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైటిల్ ఆసక్తిగా వుంది. తప్పకుండా మంచి విజయం అందుకోవాలి అన్నారు. హీరో కార్తీక్ మాట్లాడుతూ- చాలా భిన్నమైన కథతో వస్తున్నాం. పూరి జగన్నాధ్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు పూర్ణానంద్ మాట్లాడుతూ- గమ్మతె్తైన ప్రేమకథతో ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథలన్నింటికీ భిన్నంగా వుండే చిత్రమిది. సోషల్ ఫాంటసీ నేపథ్యంలో సాగుతుంది. చాలకాలం తరువాత కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో కన్పిస్తాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సిద్ధార్థ్, కెమెరా:మల్హర్‌భట్ జోషి, నిర్మాత:ప్రతిమ, దర్శకత్వం:పూర్ణానంద్.