భూత్‌బంగ్లాలో ఏం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎకె 9 స్టూడియోస్ సమర్పణలో అజయ్ కౌండిన్య, సంధ్య, అనూష హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్‌హెచ్ 47లో భూత్‌బంగ్లా’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. టిఆర్‌ఎస్ నేత ఠాగూర్ బాలాజీసింగ్, బిజెపి లీడర్ ఆంజనేయులు అతిథులుగా పాల్గొని పాటలను విడుదల చేశారు. అనంతరం బాలాజీసింగ్ మాట్లాడుతూ- సినిమా చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. మంచి ప్రయత్నం చేస్తూ తప్పకుండా విజయం అందుకుంటారు అన్నారు. దర్శకుడు అజయ్ మాట్లాడుతూ- ఇంతకుముందు వర్మ అనే చిత్రాన్ని చేశాను. ఇప్పటికి మూడు సినిమాలు చేశాను. సరికొత్త తరహాలో రూపొందిన హర్రర్ థ్రిల్లర్ ఇది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కింది అన్నారు. సంగీత దర్శకుడు చైతన్యరాజ్ మాట్లాడుతూ- అజయ్ పట్టుదలతో ఈ చిత్రాన్ని ఇప్పటిదాకా తీసుకువచ్చారు. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. తప్పకుండా మా చిత్రం మంచి విజయం సాధిస్తుంది అన్నారు.