నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్కతో ‘్భగమతి’ లాంటి సూపర్ బ్లాక్‌బాస్టర్‌ని సాధించిన యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెజా ప్రినె్సస్ నిహారిక కొణిదెల జంటగా నిర్మిస్తున్న సినిమా ‘హ్యాపీవెడ్డింగ్’ షూటింగ్ పూర్తిచేసుకుంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు. ఈ కథ చెప్పగానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహారిక మొట్టమొదటిసారి సుమంత్ అశ్విన్‌తో చేయటం విశేషం. వీరిద్దరి మధ్య జరిగే చక్కటి కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘్ఫదా’లాంటి సూపర్ బ్లాక్‌బాస్టర్ చిత్రానికి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్‌ని అందిస్తున్నారు. ఈ నెల 14 వేలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం మొదటి లుక్‌ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సమ్మర్‌లో చిత్రం విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలు సాధిస్తున్న క్రేజీ బ్యానర్ యువి క్రియేషన్స్‌లో 2018లో ‘్భగమతి’తో సూపర్ బ్లాక్‌బాస్టర్‌ని సాధించినందుకు యువి క్రియేషన్స్ వారికి మా శుభాకాంక్షలు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థతో మేము అసోసియేట్‌గా ‘హ్యాపీవెడ్డింగ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ సుమంత్ అశ్విన్, నిహారికలు జంటగా నటిస్తున్నారు. ఫిదా వంటి మ్యూజిక్ ఛార్ట్‌బస్టర్‌ని అందించిన శక్తికాంత్ కార్తీక్ మా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉంది.