‘రచయిత’ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాసాగర్ రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం ‘రచయిత’. దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొన్న ‘రచయిత’ చిత్రాన్ని ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించి 10న ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూలిపల్ల మాట్లాడుతూ ‘‘స్వచ్ఛమైన, అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. 1950 బ్యాక్ డ్రాప్‌లో సాగే కథ ఇది. పీరియాడిక్ ఫిలిమ్ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో రూపొందించాం. సంచితా పడుకోనే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం వైజాగ్‌లో వేసిన భారీ సెట్, ఆ సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆశ్చర్యపరుస్తాయి. మా దర్శకుడు కమ్ హీరో విద్యాసాగర్ నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాడు. విడుదలైన టీజర్, ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభించింది. 16న చిత్రాన్ని విడుదల చేస్తుండగా, 10న ఒంగోలులోని మినీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నాం’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: షాన్ రెహమాన్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్, నిర్మాణం: దుహర మూవీస్, నిర్మాత : కళ్యాణ్ ధూలిపల్ల, కథ, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం : విద్యాసాగర్ రాజు.