సాహసనారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క గొప్ప నటి. ఎంత గొప్పనటి అంటే మహానటి సావిత్రి మాదిరి నటనా కౌశలం వున్న నటి. అందరు కథానాయికల్లాగా కేవలం ప్రేమకథా సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు, హారర్ చిత్రాల్లో మాత్రమే కాకుండా పౌరాణిక చిత్రాలు, రాజసం వున్న చిత్రాలు, ‘వేదం’ లాంటి చిత్రాల్లో వేశ్య పాత్ర పోషించడం గొప్ప సాహసం. అనుష్క ఎలాంటి సినిమాల్లో నటించినా కూడా సమాజం ఆ సినిమా నుండి ఒకగొప్ప మెసేజ్ స్వీకరిస్తుంది. ఇప్పటివరకు ఎవరూ చేయనటువంటి పాత్రలు చేయడం సాహసోపేతం. అందరు కథానాయికల్లాగా ఏదో ఒక సూపర్‌హిట్ అయ్యే చిత్రంలో నటించామా? తగినన్ని పైసలు తీసుకున్నామా? ఆ సినిమా ఎంత హిట్ అయింది? అని కాకుండా సాహసోపేతమయిన పాత్రలు చేసిన అనుష్క ప్రేక్షకుల మదిని దోచేసింది. చరిత్రలో నిలిచిపోయేటటువంటి చారిత్రాత్మక కథా చిత్రాలు చేస్తూ చరిత్రను ప్రేక్షకులు గుర్తుంచుకునేలా నటనతో జనాల మనసును కొల్లగొట్టేస్తోంది. అనుష్క టాలీవుడ్‌కిలోకి వచ్చి పుష్కర కాలమయింది. ఎక్కువ సినిమాలు చేయకున్నా, గొప్ప మెసేజ్ ఇచ్చే చిత్రాల్లో నటించింది. కథ ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా అనుష్క తన నటనతో ఆ సినిమాలోని పాత్రలను రక్తికట్టిస్తుంది. అరుంధతి చిత్రంలో పాత్ర చేయడానికి ఎన్ని గట్స్ ఉండాలి. అనుకున్నదానికంటే ఎక్కువ రికార్డులు సాధించిన సినిమా రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-1, బాహుబలి-2లో ప్రభాస్, అనుష్క పోటీపడి నటించారు. కథకు ప్రాణం పోశారు. కాబట్టే చారిత్రాత్మక, పౌరాణిక కథను తీసే దర్శకులు అనుష్కను దృష్టిలో పెట్టుకునే కథలు తయారుచేస్తున్నారని చెప్పవచ్చు. బాహుబలి లాంటి చిత్రాన్ని ఐదు సంవత్సరాలపాటు చేయడం అంటే ఎంత సాహసం. ఐదు సంవత్సరాలపాటు పాత్రకు తగినట్టుగా బాడీలో ఎలాంటి మార్పులు రాకుండా ఉండడం ఎంత కష్టం. అయినప్పటికీ అనుష్క ఎంతో కఠోరమైన ఆరోగ్య సూత్రాలు పాటించిందని చెప్పవచ్చు. ఇక రుద్రమదేవి చిత్రం కాకతీయుల పాలనలో ఘట్టాలను తెలియజేస్తుంది. రుద్రదేవుడుగా పురుష పాత్రలో నటించడం గొప్ప సాహసం. రుద్రదేవుడుగా నటించిన పాత్రకోసం కత్తిసాము, గుర్రపుస్వారీ లాంటివి తప్పనిసరి పరిస్థితుల్లో నేర్చుకోవాల్సి వచ్చింది. కేవలం ప్యాషన్‌కే అవకాశమిచ్చే కథానాయికలున్న ఈ రోజుల్లో ఇలాంటి కఠినమైన యుద్ధ విన్యాసాలను నేర్చుకోవడం ఒక గొప్ప దార్శనిక గుణం. భారీ పర్సనాలిటీతో నటించిన ‘సైజ్ జీరో’ గురించి అయితే చెప్పనక్కర్లేదు. కేవలం ఆ సినిమా కోసం బాడీని విపరీతంగా పెంచేసుకుని ఆ సినిమా పూర్తయ్యేదాకా అదే శరీరాన్ని మెయిన్‌టైన్ చేయడం ఎంత ఇబ్బందికరం. అయినప్పటికీ అనుష్క తాను నటిస్తున్న పాత్రకు తగిన న్యాయం చేయాలనే సంకల్పంతో ఆహారపు అలవాట్లను మార్చుకుంది. మళ్లీ మామూలుగా కావటానికి నెలల తరబడి ఆరోగ్య సూత్రాలు, యోగాలాంటివి చేస్తూ పద్ధతి ప్రకారం డైట్ తీసుకుంటూ ఎన్నో పాట్లుపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అదే పౌరాణిక చారిత్రాత్మకమైన కథలో యువి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన భాగమతిలో నటించి విశ్వరూపాన్ని ప్రదర్శించి తనకు ఇక తిరుగులేదని నిరూపించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విశేషంగా అలరిస్తూ విజయతీరాల వైపునకు దూసుకెళుతోంది. ఇందులోని డైలాగ్స్ కూడా అనుష్క పాత్రకు తగినట్లుగా ఉండి చూసే ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసింది భాగమతి. నిజంగా ఎలాంటి పాత్రనైనా పోషించే దమ్ము, ధైర్యం ఉన్న సాహసనారి ఈ భాగమతి అని చిత్రసీమ కీర్తిస్తోంది.

- శ్రీనివాస్ పర్వతాల