ప్రభాస్‌తో జోడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అందాల భామ పూజా హెగ్డే జోరు ఎక్కడా తగ్గడంలేదు. ప్రస్తుతం తెలుగులో పలు క్రేజీ అవకాశాలతో బిజీగా వున్న ఈమెకు మరో బంఫర్ ఆఫర్ దక్కింది. ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్, జిల్ దర్శకుడితో మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ‘సాహో’ సినిమా విడుదలకు ఇంకా సమయం పట్టేలా వుండడంతో ఆయన ఫ్యాన్స్ అసహనంతో వున్నారట. వాళ్లను కూల్ చేయడానికి రాధాకృష్ణ సినిమాను సెట్స్‌పైకి తెచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం నెల రోజులపాటు కాల్షీట్లను కేటాయించిన ప్రభాస్, త్వరలోనే సినిమా పూర్తిచేసి జూన్ వరకు విడుదల చేయాలని చెప్పాడట. ప్రస్తుతం ఆ కార్యక్రమాల్లో బిజీగా వున్న దర్శకుడు హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలించి పూజా హెగ్డేను తీసుకోవాలని భావించారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఇప్పటికే పూజ, మహేష్ సరసన వంశీ పైడిపల్లి చిత్రంలో ఎంపికైంది. దాంతోపాటు ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల సినిమాలో కూడా నటిస్తోంది. మొత్తానికి ముగ్గురు స్టార్ హీరోలతో జోడీకడుతున్న పూజ, మరోవైపు రంగస్థలంలో ఐటెం సాంగ్ కూడా చేస్తోంది.

చిత్రం..పూజా హెగ్డే