అదరగొట్టిన రామలచ్చిమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో రామలక్ష్మికి సంబంధించిన టీజర్ వైరల్ అవుతోంది. రామలక్ష్మిగా గ్లామర్ భామ సమంత ఆకట్టుకుంటోంది. అచ్చమైన పల్లెటూరి పడుచుగా సమంత కొత్తగా కనిపిస్తూ షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. రామ్‌చరణ్ వాయిస్‌ఓవర్‌తో రామలక్ష్మి అలియాస్ సమంత నటన హైలెట్ అయింది. ఇన్నాళ్ళూ చూసిన సమంతేనా అంటూ నోరెళ్లబెడుతున్నారు జనాలు. 1985 నేపథ్యంలో రంగస్థలం అనే ఊరిలో జరిగిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారంతో పూర్తికానుంది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేస్తున్నారు.