కొత్తగా ఎందుకు చేయకూడదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా వారసత్వంగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ మొదటినుంచీ తనదైన ముద్రను చాటుకుంటూ భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు వరుణ్ తేజ్. మెగాస్టార్ ప్రభావం లేకుండా కమర్షియల్ హీరోయిజానికి దూరంగా కథలకే ప్రాముఖ్యత ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన తాజాగా తొలిప్రేమతో ముందుకు వస్తున్నాడు. కొత్త దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలవుతున్న సందర్భంగా వరుణ్‌తేజ్ చెప్పిన విశేషాలు..
నా తొలిప్రేమ..
నా ఫస్ట్‌లవ్ స్కూల్ డేస్‌లో జరిగింది.?
ఫస్ట్ లవ్..
ఫస్ట్ లవ్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ఇందులో దానే్న చర్చించాం. నా లైఫ్‌లో జరిగిన మొదటి ప్రేమను మూడు దశల్లో చూపించడం జరిగింది. మూడు దశలు అనగానే ప్రేమమ్ సినిమా గుర్తొకు వస్తుందేమో! దానికీ దీనికీ సంబంధం లేదు. అందులో హీరోకు మూడు దశల్లో ముగ్గురు అమ్మాయిలు మారుతారు. కానీ ఇందులో మొదటినుంచీ ఒకమ్మాయితో జరిగే ప్రయాణమే ఈ చిత్రం!
పోలిక లేదు
నిజానికి ఈ సినిమా 70 శాతం పూర్తయ్యాకే ఈ టైటిల్ పెట్టాం. మొదట్లో ఏ టైటిల్ పెడదామని ఆలోచించి చివరికి ఈ టైటిల్ పెట్టాం.

తొలిప్రేమ అనగానే బాబాయ్ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిజానికి ఆ సినిమాకూ ఈ సినిమాకూ ఎలాంటి పోలికలు ఉండవు. ప్రస్తుత జనరేషన్‌లో ఫస్ట్‌లవ్ ఎలా వుంది అన్నదే ఈ సినిమా.
నా పాత్ర..
ఇందులో నా పాత్ర అగ్రసివ్‌గా వుంటూ తను ఏది చేసినా కరెక్టే అనే ధోరణిలో సాగుతుంది. ఆ తరువాత పాత్రలో మెచ్యూరిటీ లెవల్స్ కన్పిస్తాయి. నాకు బాగా నచ్చింది!

రాశీ కూడా..
ఇందులో రాశి పాత్ర కూడా మూడు స్థాయిల్లో సాగుతుంది. దానికోసం తను చాలా కష్టపడింది. నిజానికి లవ్‌స్టోరీ అనగానే కొత్త హీరోయిన్ కోసం అనే్వషిస్తారు. అలా కాకుండా క్రేజ్ వున్న అమ్మాయి అయితే బాగుంటుందని ఇద్దరి ముగ్గురు పేర్లు అనుకున్నాక రాశిని ఓకె చేశాం. తను ఊహలు గుసగుసలాడేలో అద్భుతంగా చేసింది. ఆ తరువాత ఈ సినిమాలో కూడా తనకు మంచి పేరొస్తుంది.

క్లారిటీ వుంది..
దర్శకుడు వెంకి కొత్తవాడైనా నాకు చాలాకాలంగా పరిచయం. తనకు కథలపై మంచి పట్టు వుంది. ఇదివరకే చెల్లి నిహారిక తీసిన ముద్దపప్పు ఆవకాయ వెబ్ సీరీస్‌కు తను సపోర్టు అందించాడు. అప్పటినుంచి నాకు ఒక కథ చెప్పాలని ట్రై చేస్తున్నాడు. ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. దర్శకుడిగా కూడా అద్భుతంగా చేశాడు. అలాగే నిర్మాత ప్రసాద్, బాపినీడు ఇద్దరూ ప్రతి విషయాన్ని దగ్గరుండి మరీ చూసుకున్నారు కాబట్టే సినిమా ఇంత బాగా వచ్చింది.
కొత్తగా చేయాలనే..
చిన్నప్పటినుంచి సినిమా వాతావరణంలో పెరిగాను. నాకు సినిమా అంటే ఇష్టం. శుక్రవారం వచ్చిందంటే సినిమా చూడాల్సిందే. ప్రపంచ స్థాయిలో వున్న అన్ని సినిమాలూ చూశం. మనం ఎందుకు హాలీవుడ్ తరహాలో కొత్త కొత్త ప్రయోగాలు చేయకూడదు అనిపించింది. ఆ ఆలోచనతోనే భిన్నంగా ట్రై చేయాలని ఇలా కొత్త కథలతో వెళుతున్నా.
తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం ఘాజి దర్శకుడు సంకల్ప్‌రెడ్డితో ఓ స్పేస్ చిత్రం చేస్తున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ చిత్రం ఇది. శ్రీహరికోట నేపథ్యంలో ఉంటుంది. దాంతోపాటు అనిల్ రావిపూడి కూడా ఓ లైన్ చెప్పాడు. ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదు.

- శ్రీ