యాక్షన్ సినిమాలకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ పులి సినిమాతో పరిచయమైన బ్యూటీ నికిషాపటేల్. అలరించే అందం.. ఆకట్టుకునే అభినయం నికిషా సొంతం. అయితే ఈ బ్యూటీ కెరీర్ అనుకున్నంత వేగంగా సాగలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతోంది. ఈ సినిమాలో నికిషా పోలీసు ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కన్పిస్తుంది. అందుకు తగ్గట్టుగానే సినిమా టైటిల్‌ను కూడా ‘రౌడీ పోలీస్’ అని పెట్టారు. టైటిల్‌తోపాటు నికిషా పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ముకుల్‌దేవ్ విలన్‌గా నటిస్తున్నాడు. మరో ముఖ్యమైన పాత్రలో సీనియర్ హీరో భానుచందర్ నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో రిస్కీగా సాగే రోప్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయట. వాటిని ఎలాంటి డూప్ లేకుండా అత్యంత సహజంగా చేసింది హీరోయిన్ నికిషా. సినిమా కోసం కాదు కానీ ఆల్రెడీ నికిషా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని ఉంది. పైగా తను రియల్ బాక్సర్ కూడా. కాబట్టి ఈ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చాలా ఈజీగా చేసేసింది. అంతేకాదు, ఇకపై ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది. జానీ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు.