శర్వానంద్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ సరసన హలో చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూతురైన కళ్యాణి హీరోయిన్‌గా కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. తాజాగా మరో క్రేజీ అవకాశాన్ని పట్టేసింది. స్వామి రారా డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. మొదట ఈ సినిమాలో కాజల్, నిత్యమీనన్ నటిస్తున్టన్లు అధికారికంగా ప్రకటించిన మాట వాస్తవమే. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వారిద్దరూ ఈ సినిమాలో నటించడంలేదు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కళ్యాణి ప్రియదర్శిని నటించబోతోంది. మార్చి మూడో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాలో నటించే హీరోయిన్ వివరాలు తెలియనున్నాయి.