పెళ్లికి గ్రీన్ సిగ్నల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి తమిళ హీరో విశాల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు? ఇన్నాళ్లు పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వస్తున్న విశాల్.. ఫైనల్‌గా పెళ్లికి సిద్ధం అయినట్టు ఓ మీడియా సమావేశంలో చెప్పేశాడు. దాంతో విశాల్ పెళ్లిచేసుకునేది ఎవరిని అని గుసగుసలు ఎక్కువయ్యాయ. దానికి కారణం.. విశాల్ గత కొంతకాలంగా శరత్‌కుమార్ అమ్మాయి వరలక్ష్మితో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య శరత్‌కుమార్‌తో విశాల్‌కు నడిగర్ సంఘం విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో వీరిద్దరూ దూరంగా వుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే విశాల్ పలు కార్యక్రమాలతో బిజీగా వున్నాడు. నడిగర్ సంఘానికి సంబంధించిన భవన నిర్మాణాన్ని చేయిస్తున్నాడు. ఆర్థికంగా చితికిన నటీనటులను ఆదుకుంటామని తెలిపారు. ఈ భవన నిర్మాణం అయ్యేవరకు పెళ్లిచేసుకోను అని చెప్పిన విశాల్- మొత్తానికి అనుకున్నట్టే భవనాన్ని ఓపెన్ చేయించాడు. మరి విశాల్ పెళ్లాడే అమ్మాయి ఎవరా? అన్న ఆరాలు ఎక్కువవుతున్నాయి.