‘చల్ మోహన్‌రంగ’ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, మేఘా ఆకాష్ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చల్ మోహన్‌రంగ’ మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణలో ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇది నితిన్‌కు 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ‘చల్ మోహన్‌రంగ’ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘నా అభిమాన కథానాయకుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ప్రచార చిత్రాలను ట్విట్టర్ ద్వారా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉంది’ అని హీరో నితిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ - ‘తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకు మా తరపున, చిత్రం యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు. చిత్రం టీజర్‌ను ప్రేమికులరోజు అయిన ఈ నెల 14న, చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన ఒక్క గీతాన్ని ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నామని తెలిపారు. హైదరాబాద్, ఊటీ, అమెరికాలో ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకుందీ చిత్రం. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ - ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు. నా ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ విడుదల చేయడం ఆనందంగా ఉందని, కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరపుకుంటోంది. డా.కె.వి. నరేష్, లిజీ, రోహిణి హట్టంగడి. రావు రమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెనె్నల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్ థమన్, కెమెరా: ఎం. నటరాజ సుబ్రమణియన్, నృత్యాలు: శేఖర్ వి.జె, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, ఫైట్స్: స్టంట్ సిల్వ, రవివర్మ, సమర్పణ: శ్రీమతి నిఖితరెడ్డి, నిర్మాత: ఎం. సుధాకర్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణ చైతన్య.