మాట నిలబెట్టుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్నేహగీతం’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. తనలోని దర్శకుడిని పరిచయం చేయడానికి మరే సినిమాలో నటించలేదు. దర్శకుడిగా మొదలుపెట్టిన ఆయన వరుణ్‌తో తీసిన ‘తొలిప్రేమ’ మంచి విజయాన్ని అందుకుంది. బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు.. ‘తొలిప్రేమ’ ప్రీరిలీజ్ వేడుకను భీమవరంలో నిర్వహించాం. అక్కడికి వచ్చిన మెగా అభిమానులకు గతంలో వచ్చిన తొలిప్రేమ గౌరవాన్ని పెంచే స్థాయిలో తాజా చిత్రాన్ని రూపొందిస్తానని ప్రామిస్ చేశాను. ఆ మాటను నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. దర్శకుడిగా సక్సెస్‌ని సాధించాలని కోరుకున్నానే కానీ ఈ స్థాయిలో సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందని మాత్రం ఊహించలేదు. దర్శకుడిగా అవకాశం కోసం చాలా ఏళ్ళు ఎదురుచూశాను. ఓ దశలో చిన్న అసహనానికి లోనయ్యాను. తొలిప్రేమ సినిమా అనుకున్న తరువాత వరుణ్‌కు ప్రమాదం జరిగింది. దాంతో అతను అంగీకరించిన సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. అలా జరిగి వుండకపోతే ఈ చిత్రం ముందే బయటికి వచ్చేది. ముకుంద టీజర్ చూసినపుడు మన కథకు ఇలాంటి హీరో అయిన బాగుంటుందని అనిపించింది. అయినా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో ప్రేమకథ చేస్తాడా అనే చిన్న భయం ఉండేది. కంచె విడుదలైన తరువాత చేయగలడనే ధైర్యం ఏర్పడింది. ముందు ఈ కథను దిల్‌రాజుకు వినిపించాను. ఆ సమయంలో ఆయన ఎక్కువ సినిమాలతో బిజీగా వుండడంతో బివిఎస్‌ఎన్ ప్రసాద్‌కు చెప్పాను. ఆయన తనయుడు బాపినీడు నాకు మంచి మిత్రుడు కావడంతో నా పని మరింత సులువు అయింది. తొలిప్రేమ టైటిల్ అనుకున్నప్పుడు అభిమానుల నుంచి వ్యితిరేకత వస్తుందేమోనని ముందు భయపడ్డాను కానీ ఫస్ట్‌లుక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడంతో ఆ భయం పోయింది. అయితే కొంతమంది మాత్రం తొలిప్రేమ టైటిల్ పెట్టావు జాగ్రత్తగా సినిమా తీయమని వార్నింగ్ ఇచ్చారు.