సైకలాజికల్‌గా మసక్కలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి రోనక్, శ్రావ్య, శిరీషా వంక ముఖ్యపాత్రల్లో నబీ యేనుగుబాల దర్శకత్వంలో సుమిత్‌సింగ్ నిర్మించిన చిత్రం ‘మసక్కలి’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ టీజర్‌ను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ- కొత్తగా వస్తోన్న దర్శకులు మంచి కథలను రూపొందిస్తున్నారు. ట్రైలర్ బాగుంది. ఇలాంటి కథలు మరిన్ని రావాలి. దర్శకుడి ప్రతిభను అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి అన్నారు. మధురా శ్రీ్ధర్ మాట్లాడుతూ- మధుర ఆడియో ద్వారా పాటలను విడుదల చేస్తున్నాం. అద్భుతమైన పాటలున్నాయి. తప్పకుండా సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. దర్శకుడు నబి యేనుగుబాల మాట్లాడుతూ- ఈ చిత్రం సైకలాజికల్ గేమ్‌తో వుంటుంది. దాంతోపాటు అందమైన ప్రేమకథ ఆకట్టుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది న్యూ ఏజ్ లవ్‌స్టోరీ. కొత్త ప్రయత్నం చేశాం. తప్పకుండా మీ సపోర్టు మాకుంటుందని ఆశిస్తున్నాను అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మహిరామ్స్, ఎడిటింగ్:శివ శర్వాణి, కెమెరా:సుభాష్ దొంతి, నిర్మాత:సుమిత్‌సింగ్, దర్శకత్వం:నబి యేనుగుబాల (మల్యాల).