కొత్తగా ఉన్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాష్, ప్రియా, సోనియా హీరో హీరోయిన్లుగా ఎం.రాధ దర్శకత్వంలో జైబాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై ఎం.కె.రాజా నిర్మించిన చిత్రం ‘కొత్తగా ఉన్నాడు’. యు.కె.మురళి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతోపాటు దినేష్ మాడ్నే, రవిశర్మ, బాల్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, ఆర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని పాటలను హీరో ఆకాష్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- మురళి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మంచి ప్రేమకథతోపాటు అన్నిరకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన చిత్రం ఇదని, తప్పకుండా ప్రతిఒక్కరికీ నచ్చుతుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ఇందులో హీరో రెండు షేడ్స్ కలిగిన పాత్రల్లో కన్పిస్తాడని, లండన్ నేపథ్యంలో సాగే కథలో ఆంధ్ర, తెలంగాణ కుర్రాడిగా రెండు పాత్రల్లో నటించాడని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షాన్, సంగీతం: యు.కె.మురళి, ఎడిటింగ్: ప్రేమ, నిర్మాత: ఎం.కె.రాజా, దర్శకత్వం: ఎం.రాధ.