అంతా నా ఇష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో సినిమాలు అనగానే గ్లామర్ మాత్రమే అడుగుతున్నారు అంటూ క్లాసులు పీకేసి.. బాలీవుడ్‌లో ఒక మ్యాగజైన్ కవర్ అనగానే ఏకంగా బికినీల్లో, బ్రాలలో, అండర్‌వేర్‌ల్లో కూడా ఫోజులు ఇచ్చేసిన రకుల్ ప్రీత్‌సింగ్‌పై ప్రశంసల కంటే క్రిటిసిజం ఎక్కువగా వినిపించింది. ఆమె తెలుగు సినిమాలను కాస్త చులకనగా చూడటం వలన.. వెంటనే ఇక్కడనుండి చాలామంది పంచులు వేసేశారు. అవన్నీ రకుల్ చెవిన కూడా పడ్డాయి. అయితే వీటన్నింటిపై చాలా ఘాటుగా స్పందిస్తోంది రకుల్. అసలు నా ఫొటో షూట్లు నా ఇష్టం అంటూ సమాధానం చెప్పేసింది. ‘‘చూడండి.. నాకు రాక రాక ఒక టాప్ మ్యాగజైన్ నుండి ఫొటోషూట్ చేసే ఆఫర్ వచ్చేసింది. అలాంటి ఆఫర్‌ను ఏ హీరోయిన్ కూడా వద్దనుకోదు. అందుకే నేను వద్దనుకోలేదు. ఇక కామెంట్లు అంటారా.. కొంతమంది పొగుడుతారు.. కొంతమంది తిడతారు. నేను దేనికీ ఉబ్బి తబ్బిబ్బవను.. దేనికీ కుమిలిపోను. లైట్ తీస్కోండి. నాకు నచ్చింది ఆ ఫొటో షూట్. నా ఫ్యామిలీకి నచ్చింది. మేం ఇష్టపడ్డాక ఇంక ఎవరేమంటే ఏంటి?’’ అంటూ ప్రశ్నించింది రకుల్. అంతేలేండి.. ఫేం వచ్చేవరకూ ఏం చేసినా అభిమానులకోసం చేస్తున్నాను అనడం.. ఫేం వచ్చేశాక నా ఫొటోలు నా ఇష్టం అనడం హీరోయిన్లకు షరా మామూలే!