గుండు హనుమంతరావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న గుండు హనుమంతరావు (61) సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కొన్ని రోజుల క్రితం కోలుకున్నట్లే కనిపించారు కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని తన స్వగృహంలో తెల్లవారు జామున 3.30 గం.లకు తుదిశ్వాసను విడిచారు. ఆయన మరణం అందరినీ శోక సంద్రంలో ముంచేసింది. ఆయన కుటుంబంలో ఇపుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విన్న సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. గుండు హనుమంతరావు 19 ఏళ్ళ వయసులో చిత్రసీమలోకి ప్రవేశించి దాదాపు 400పైగా సినిమాల్లో నటించారు. బాబాయ్ హోటల్, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, నవ్వొస్తానంటే నే వద్దంటానా, అతడు, జై చిరంజీవ, భద్ర, ఆట వంటి సినిమాల్లో నటించారు. అమృతం టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడుసార్లు టీవీ కార్యక్రమాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నారు. ఒకసారి మద్రాస్‌లో ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల ‘అహనా పెళ్లంట’ సినిమాలో మొదటిసారిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. సుమారు 50 సినిమాలు చేసిన తరువాత ఆయన విజయవాడ నుండి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. గుండు హనుమంతరావు అక్టోబర్ 10, 1970న కాంతారావు-సరోజిని దంపతులకు జన్మించారు. ఆయన భార్య ఝాన్సీరాణి 2010లో ప్రమాదశాత్తు కాలు జారి పడి మరణించింది. ఇతనికి ఇద్దరు సంతానం. ఒక కుమారుడు మరియు కుమార్తె. కుమార్తె కొద్దిరోజుల క్రిందట మరణించింది.
గుండు హనుమంతరావు మృతి తీరని లోటు: చిరంజీవి
తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో వైలి. అలానే గుండు హనుమంతరావు సైతం తనదైన శైలితో తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆమధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నావంతు సాయం అందించాను. పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.