జనతా గ్యారేజ్ మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ అంటూ ఓ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుంచే ఆ సినిమాపై సర్వత్రా ఆసక్తికనిపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరో ప్రధాన పాత్రలో నటించనుండడం కూడా ఈ ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తిచేసుకున్న ఈ సినిమా మొదలైంది. మైత్రీ మూవీమేకర్స్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్ మొదలైంది. మైత్రీ మూవీమేకర్స్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్ మూడునాలుగు రోజులపాటు షూటింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత సారథి స్టూడియోలో ‘జనతాగ్యారేజ్’కోసం ప్రత్యేకంగా వేసిన ఓ భారీ సెట్లో 40 రోజులకు పైనే షూటింగ్ జరగనుంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేసేలా ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్లాన్‌చేశారు. ఈమధ్యే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో మంచి హిట్‌కొట్టిన ఎన్టీఆర్, ‘జనతాగ్యారేజ్’తో ఆ సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తాడన్న ప్రచారం మొదలవ్వడంతో ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.