జోరు జోరుగా.. ప్రేమాయణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్ చిత్రం ‘మద రాసి పట్టణం’ అనే సినిమాతో దక్షిణాదిన హీరోయినగా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్, తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన ‘ఐ’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగులో ‘ఎవడు’ చిత్రంలో నటించిన ఈ భామ, అప్పుడప్పుడు ఘాటు ఘాటు ఫొటోలతో జనాలకు షాకులిస్తూనే వుంది. అసలే లండన్ భామ కావడంతో ఆమె వ్యవహార శైలి కూడా మోడరన్‌గానే వుంటోంది. ప్రస్తుతం రజనీకాంత్ సరసన రోబో 2.0లో నటించిన ఈ భామ, ఆ సినిమా విడుదల కోసం తెగ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ సినిమా విడుదలైతే మళ్లీ తన క్రేజ్ పెరుగుతోందని భావిస్తోంది. ప్రస్తుతం చేతిలో పెద్దగా చిత్రాలు లేకపోవడంతో ప్రేమాయణం సాగిస్తోంది. జార్జి పయోనెట్ అనే యువకుడితో గత కొద్దిరోజులుగా తిరుగుతోందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని బి టౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరూ షికార్లు చేయడమే కాకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దానికి ఇంకా ఆజ్యం పోస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి.