సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఎం-6’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతి, శ్రావణి, ప్రియ హీరో హీరోయిన్లుగా జయరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్‌లపై విశ్వనాథ్ తన్నీరు, సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎం-6’. ఈ చిత్రం టైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలించాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ టైలర్‌ను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ హారర్ అంశాలతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్ బావుంది. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న మారుతి భవిష్యత్తులో పెద్ద హీరోగా ఎదిగే లక్షణాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు టాలెంట్ ట్రైలర్‌తో తెలిసిపోతుంది. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. దర్శకుడు జయరామ్ వర్మ మాట్లాడుతూ నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు రుణపడి వుంటాను.
ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అయినప్పటికీ కడుపుబ్బ నవ్వించే కామెడీ కూడా ఉంటుంది. దాంతో పాటు చిన్న సందేశాన్ని అందిస్తున్నాం అన్నారు. నిర్మాత విశ్వనాథ్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను చేస్తున్నాం. అద్భుతంగా సినిమా వచ్చింది. ప్రస్తుతం వస్తున్న థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి వెంకట్, నటి రాగిణి, హీరో మారుతి తదితరులు పాల్గొన్నారు.