షాకిచ్చిన హృతిక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హృతిక్ రోషన్ అంటే ఇప్పటికీ అమ్మాయిల హృదయాల్లో స్థానం సుస్థిరం చేసుకున్న స్టార్. ఆయనకున్న చరిష్మా గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. క్రిష్, ధూమ్-2, ఏ జిందగీ మిలేంగీ దుబారా లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న హృతిక్ రోషన్ ఆకస్మికంగా జైపూర్ రోడ్లపై సైకిల్‌పై తిరుగుతూ అప్పడాలు అమ్ముకోవడం షాక్ కలిగిస్తోంది. హృతిక్ రోషన్ అప్పడాలు అమ్మడం ఏమిటా అని అక్కడున్నవాళ్లు షాక్ అయ్యారు. కొందరైతే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. అయితే, ఇదంతా ఓ సినిమా కోసమని తెలిసి అందరూ నవ్వుకున్నారు. నిజంగా పాత్రలో జీవించేందుకు ఇలా సాధారణ అప్పడాలు అమ్మే వ్యక్తిగా హృతిక్ రోషన్ లీనమైపోయాడని అంటున్నారు సినీ జనాలు.