‘కందిరీగ’ దర్శకుడితో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఓ వైపు హీరోగా డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ మరోవైపు ‘అ!’తో నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నటిస్తున్న నాని, మరో చిత్రానికి ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రం పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆగిపోయింది. దాంతో పవన్ స్థానంలో నానితో సినిమా చేయించాలని నిర్మాతలు భావించారట. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే, నాని హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించే ఈ సినిమాకు వేరే కథ వుంటుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం వుంది.