అమెరికాలో ‘గూఢచారి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘క్షణం’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్ విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా, మిస్ ఇండియా తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ళ కథానాయికకా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్ నామా టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ తెలుగు తెరపై చూడని సరికొత్త కానె్సప్ట్‌తో ‘గూఢచారి’ తెరకెక్కుతోంది. ఢిల్లీ, పూణె, హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, చిట్టగాంగ్ బంగ్లాదేశ్‌లలో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలోని కాస్కేడ్ వౌంటైన్స్‌లో జరుగుతోంది. అక్కడి అందమైన, అత్యద్భుతమైన లొకేషన్స్‌లో అడివి శేష్ షూట్ చేస్తున్నారు. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. విడుదలై ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. వేసవి కానుకగా ‘గూఢచారి’ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్స్ డిజైన్ శివం రామ్, ఎడిటర్ గ్యారీ బిహెచ్, సినిమాటోగ్రఫీ: షానిల్ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: వివేక్ కొచిభొట్ల, నిర్మాతలు: అభిషేక్ నామా టిజి విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్, కథ: అడివి శేష్, దర్శకత్వం: శశికిరణ్ తిక్క.