అదే స్ఫూర్తితో ‘దండుపాళ్యం 4’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకట్ మూవీస్ బ్యానర్‌పై కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘దండుపాళ్యం 4’. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘దండుపాళ్యం పార్ట్1, పార్ట్2లను తెలుగు ప్రజలు ఆదరించారు. వారిచ్చిన స్ఫూర్తితో దండుపాళ్యం 4ను ప్రారంభించాం. దండుపాళ్యంపై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుంది. ఇప్పుడు దండుపాళ్యం 3కి డైరెక్టర్ ఎవరనేది తెలియదు. ఆర్టిస్టుల గురించి పెద్దగా తెలియదు. ప్రేక్షకుల ఆశీర్వాదం, నా కృషితో రెండు సినిమాలు ప్రజలకు బాగా రీచ్ అయ్యాయి. దర్శకుడు కె.టి.నాయక్ మంచి ఇంటిలిజెంట్. హార్డ్ వర్కర్. ఈయనకు క్రైమ్ జోనర్‌లో సినిమాలు చేయాలంటే చాలా ఇష్టం. ఆయన ఎలా దండుపాళ్యం 4 చేయవచ్చో చెప్పిన తీరు నాకు నచ్చింది. దండుపాళ్యం, బాహుబలి రెండు సినిమాల రేంజ్ వేరైనా ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌కి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యాయి. కొందరి వ్యక్తిగత అహాల కారణంగా దండుపాళ్యం 2 నేను అనుకున్నట్లుగా రాలేదు. ఆడియెన్స్ ఏమైతే సినిమాలో ఉండాలనుకుని థియేటర్‌కి వచ్చారో అది సినిమాలో లేదు. దాంతో ఓ కసితో దండుపాళ్యం 4ను స్టార్ట్ చేశాను. పక్కా స్క్రిప్ట్ వర్క్‌తో సినిమాను స్టార్ట్ చేస్తున్నాం. మార్చిన సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దండుపాళ్యం 4లో రెండు గ్యాంగ్‌లుంటాయి. మొదటి మూడు పార్ట్స్‌లో నటించిన నటీనటులతో పాటు వేరే గ్యాంగ్ కూడా ఇందులో కనపడుతుంది. దండుపాళ్యం రీసెర్చ్‌లో మాకు దొరికిన సమాచారంతో పది సీక్వెల్స్ తీయవచ్చు. నిజమైన ఘటనను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుంది’’ అన్నారు. దర్శకుడు కె.టి. నాయక్ మాట్లాడుతూ ‘నేను నిజామాబాద్ ఆర్మూర్‌లో పుట్టి పెరిగినాను. కానీ తమిళనాడు, కర్నాటకల్లో స్థిరపడ్డాను. నాకు ఇచ్చిన పనిని 100 శాతం నెరవేరుస్తాను. నిర్మాతకు కృతజ్ఞతలు. ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా ఈ సీక్వెల్ ఉంటుంది’’ అన్నారు. వోల్గా బాబ్జీ మాట్లాడుతూ వెంకట్‌గారికి అతని టీమ్‌కు అభినందనలు అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నా సినిమాల్లో కూడా మహాత్మ 2, పెళ్లి సందడి 2 వంటి సినిమాలు చేయాలని చాలా మంది అనుకున్నారు కూడా. ఇక దండుపాళ్యంకు ఉన్న క్రేజ్ తెలిసిందే. ముందు విడుదలైన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్‌ను సాధించాయో అందరికీ తెలిసిందే. ఇందులో విషయాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని పార్టులైనా షూటింగ్ చేయవచ్చు. నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా చేసిన సినిమాలు ఇవి. దండుపాళ్యం 4 పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.