‘పటాస్’ దర్శకుడితో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ తన 103వ సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. నిజానికి ఆయన ఎన్టీఆర్ బయోపిక్ చేయాలని ప్లాన్ చేశాడు కానీ దర్శకుడు తేజ వేరే సినిమా విషయంలో బిజీగా ఉండడంతో ఈలోగా మరో సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. అయితే ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనతో కథాచర్చలు జరుపుతున్నారు. తాజాగా కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాడు. గతంలో కూడా ‘రామారావుగారు’ అనే టైటిల్‌తో సినిమా చేస్తాడని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యతో సినిమా చేయాలని నిర్మాత సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు. బాలకృష్ణ 102వ సినిమాగా ‘జై సింహా’ను నిర్మించిన సి.కల్యాణ్ వెంటనే మరో సినిమాను కూడా బాలయ్యతో చేయడానికి సిద్ధం అయ్యాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి సూపర్‌హిట్స్‌తో మంచి జోరుమీదున్న అనిల్ రావిపూడి త్వరలోనే బాలయ్యను కలిసి కథ చెబుతాడట.