చరణ్‌తో మరోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం ఈనెల 30న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత ఈ జోడి మరోసారి కలిసి నటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అవును. వివరాల్లోకి వెళితే.. రంగస్థలం తరువాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత బాహుబలి లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన రాజవౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్‌లతో తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా సమంత నటిస్తుందట! ఇక ఎన్టీఆర్ సరసన గ్లామర్ భామ రాశిఖన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అటు మెగా.. ఇటు నందమూరి హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడట రాజవౌళి.