16న గులేబకావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుదేవా, హన్సిక జంటగా సీనియర్ నటి రేవతి ముఖ్య పాత్రలో కళ్యాణ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన గులేబకావళి చిత్రం మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని అదే పేరుతో సుర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ తమిళంలో ఘన విజయం సాధించిన గులేబకావళి చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నాం. గులేబకావళి అనే గ్రామంలో ఉన్న నిధి కోసం జరిగే అనే్వషణ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రభుదేవా డ్యాన్స్, నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రేవతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, నిర్మాత: మల్కాపురం శివకుమార్, దర్శకత్వం: కళ్యాణ్.