12నుంచి మొదలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనే రాజు నేనే మంత్రి తరువాత తేజ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆట నాదే వేట నాదే అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో వుంది. మార్చి 12 నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. వెంకటేష్ నటిస్తున్న 72వ సినిమా ఇది. అలాగే శ్రీయకు కూడా ఇది 72వ సినిమా అవ్వడం విశేషం. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఒకే సినిమాలో నటించబోతున్నారు. అనుప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అభినవ్ రామానుజం సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. గురు సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని వెంకటేష్ చేస్తున్న సినిమా ఇది. నారా రోహిత్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో దాదాపు కొత్త నటీనటులు నటిస్తున్నారు. సురేష్‌బాబు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.