నేటి నుంచి థియేటర్లు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల నిర్మాతల మండలి ఐకాస తీర్మానించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా థియేటర్లను బంద్ చేస్తున్నట్టు ఐకాస చైర్మన్ నిర్మాత డి.సురేష్‌బాబు గురువారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా ఐకాస ఏర్పాటు చేసుకున్నామని సినిమాల ప్రదర్శన విషయంలో సర్వీస్ ప్రొవైడర్ల విధానం వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అధిక భారం పడుతుందని, అందుకే రేటు తగ్గించమని అడుగుతున్నామని తెలిపారు. ఆంగ్ల చిత్రాలకు లేని వర్చువల్ ప్రింట్ ఫీజు ప్రాంతీయ చిత్రాలకు మాత్రం ఎక్కువగా వసూలు చేస్తుందన్నారు. వాటిని తగ్గించే వరకు ఈ బంద్ కొనసాగుతుందని తెలిపారు. ఈ బంద్ విషయంలో ఐదు రాష్ట్రాల్లోని నిర్మాతలు, పంపిణీదారులు సపోర్టు అందించాలని అన్నారు. కేవలం విపిఎఫ్ ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా చాలా ఇబ్బందులున్నాయి, ముఖ్యంగా కొన్ని సినిమా థియేటర్లలో 20 నిమిషాల పాటు ప్రకటనలు వేస్తూ ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తున్నారని, ప్రస్తుతం సినిమకు ప్రేక్షకుడు రావడమే ఇబ్బంది అనుకునే పరిస్థితుల్లో వారిపై ఇలా ప్రకటనలు రుద్దుతూ అసహానికి గురి చేయడం ఎందుకు? అలాగే మిగతా సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ ట్రైలర్స్ విషయంలో ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి, మేము అడిగిన దానికి దగ్గరలోనే వాళ్లు రేటు విషయం చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను బంద్ చేస్తున్నాం. వారు దిగొచ్చి మా కండిషన్ల ఒప్పుకున్న మరుక్షణమే బంద్‌ను నిలిపి వేస్తామన్నారు. బంద్ వల్ల ఇతర సినిమాలకు నష్టం రావొచ్చు కానీ సినిమాలను ఆపేయాలని మా ఉద్దేశం కాదు. సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉండాలని నిర్మాతలకు రేట్లు తగ్గడం వల్ల మంచి ఉపయోగం ఉంటుందని అన్నారు. దీనివల్ల ప్రతి ఓక్కరికి న్యాయం జరుగుతుందని, బంద్ వల్ల కోల్పోయే నష్టం కన్నా భవిష్యత్‌లో వచ్చే లాభమే ఎక్కువ. ప్రస్తుతం తెలుగు సినిమాలకు మాత్రమే బంద్ నిర్వహిస్తున్నాం. హిందీ, ఇంగ్లీష్ సినిమాల వాళ్లతో మాట్లాడుతాం. మేమంతా చిత్ర పరిశ్రమలో భాగంగానే మాట్లాడతాం, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. దాని వల్ల అందరూ కలిసికట్టుగా ఇండస్ట్రీ బాగు కోసం కృషి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. సి.కల్యాణ్, దామోదర్ ప్రసాద్, మురళీమోహన్, రాందాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.