భరత్ విజన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ‘ది విజన్ ఆఫ్ భరత్’ను మార్చి 6న విడుదల చేయనున్నారు. లక్షలాది జన సందోహాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంచి... మధ్యలో కారులో వున్న మహేష్‌బాబు పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే.. ఇంతకీ విజన్ అంటే ఏం ఇస్తారు అన్న డౌట్ అభిమానుల్లో వుంది. ఇప్పుడు ఎలాగూ రకరకాల పేర్లతో హంగామా చేయడం మేకర్స్‌కు పరిపాటి అయింది కాబట్టి.. టీజర్‌కే ఈ పేరు పెట్టి.. ఏదో చూపించబోతున్నారు అనుకుంటున్నారు. అంటే భరత్ అనే నేనుకు మార్చి 6న టీజర్ వస్తుందనే ఎక్స్‌పెక్టేషన్స్ వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి పాత్రల్లో రాష్ట్రాన్ని మహేష్ ఎలా మార్చదలచుకున్నాడో అనే విజన్‌ని వినిపిస్తారనే అంచనాలు కూడా వున్నాయి. అలాగే విజన్ అంటూ అసెంబ్లీలోపల తతంగాన్ని కొరటాల చూపిస్తాడేమో అనుకుంటున్నారు. ఏం చూపించినా కానీ.. ఏదో ఒకటి కొత్త అంశాలు అయితే వస్తాయి కదా అని సంబరపడుతున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్.