హైదరాబాద్‌లో సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష శ్రీ్ధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఫిలిం సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ నెల 14 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. బుధవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నాం. హోలీ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు మంచి క్రేజ్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 4న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. అర్జున్, శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ శేఖర్, కెమెరా: రాజీవ్ రవి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: కె.నాగబాబు, సహ నిర్మాత: బన్నీ వాసు, నిర్మాత: లగడపాటి శిరీష శ్రీ్ధర్, రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ.