రవితేజ సరసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది రాజాదిగ్రేట్, టచ్ చేసి చూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఈ ఏడాది కళ్యాణ్ దర్శకత్వంలో నేల టికెట్, శ్రీను వైట్ల సినిమాలతో రాబోతున్నాడు. నేల టికెట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా శక్తికాంత్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీను వైట్ల సినిమా షూటింగ్ అధికభాగం అమెరికాలో జరగనుంది. ఈ సినిమాకు అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ఖరారు చేశారు. మూడు విభిన్న పాత్రల్లో రవితేజ కనిపించబోతున్నాడు. అందుచేత ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అనే వార్త ప్రచారంలో ఉంది. కానీ వాస్తవానికి ఈ సినిమాలో నటించేది ఒక్క హీరోయిన్ మాత్రమేనని సమాచారం.

చిత్రం..మాళవిక శర్మ