పెళ్లి రూమర్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝుమ్మంది నాదంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన తాప్సీ కి తెలుగులో పెద్ద చెప్పుకోదగ్గ అవకాశాలు లేనప్పటికీ హిందీలో మాత్రం కెరీర్ బానే సాగుతోంది. కానీ ఈమె దురదృష్టమో ఏమో కాని ఈమె ఏం మాట్లాడినా జనాలు పెడార్థాలు తీసేస్తున్నారు. మళ్లీ ఈమె వచ్చి అది కాదు మొర్రో అని చెప్పుకోవలసి వస్తోంది. సోషల్‌మీడియాలో ఈ మధ్యనే చేసిన ఒక పోస్ట్ వల్ల ఇరకాటంలో పడింది. ఏదో పోస్ట్ బావుంది కదా అని షేర్ చేస్తే మీడియా వాళ్లు ఏదేదో ఊహించేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. చివరకు తాప్సీ దిగొచ్చి అది కాదు తన ఉద్దేశం అని చెప్పింది. తన ట్విట్టర్‌లో పెళ్లి గురించి ఏదో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ మొత్తం అబ్బాయిలు అనవసరంగా పెళ్లంటే భయపడతారు అని పెళ్లికి ఎప్పుడు నో చెప్పొద్దూ అంటూ ముగుస్తుంది. కాగా ఇది చూసి ఒక మీడియా తాప్సీ పెళ్లికి యెస్ అంటోంది అంటూ న్యూస్ రాసేశారు. ఇది చూసిన తాప్సికి చిర్రెత్తుకొచ్చింది. ఇంక ఆపండి. గెట్ ఏ లైఫ్ అంటూ ఆ మీడియా ఛానెల్‌కు చెప్తూనే నిజమైన న్యూస్ రాయండి అంటూ వార్నింగ్ కూడా ఇవ్వకనే ఇచ్చింది. అయినా పెళ్లికి నో చెప్పొద్దూ అంటూ పోస్ట్ పెట్టినంత మాత్రాన తను పెళ్లికి ఎస్ అంటుంది అని అనుకుంటే ఎలా?

చిత్రం..తాప్సీ