16న ‘కిర్రాక్ పార్టీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ హీరోగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన కిర్రాక్ పార్టీ చిత్రాన్ని మార్చి 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. చిత్రం షూటింగ్ పూర్తికాగా, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. ఇటీవలే విడుదలైన ‘కిర్రాక్ పార్టీ’ టీచర్ మరియు పాటలకు విశేష స్పందన వస్తుంది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి. కాలేజీ క్యాంపస్ డ్రామాగా వస్తుండడంతో ‘కిర్రాక్ పార్టీ’ నిఖిల్‌కు ‘హ్యాపీ డేస్’ తరహా మరో భారీ విజయం అవుతుందని అంత ఆశిస్తున్నారు. కిర్రాక్ పార్టీతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్‌తో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు రాయటం మరో విశేషం. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఏటివి బ్యానర్‌లపై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చి 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.