కొరటాల శివతో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్లోఅండ్ స్టడీగా వరుసగా ఒకదాన్ని మించి మరో విజయాన్ని అందుకుంటున్నాడు యంగ్ హీరో నాని. డబుల్ హ్యాట్రిక్ అందుకున్న నానితో సినిమాలు చేసేందుకు పలువురు క్రేజీ దర్శకులు క్యూ కడుతున్నారు? ఇప్పటికే త్రివిక్రమ్ నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడు కూడా నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా.. కొరటాల శివ? ఏంటి షాక్ అవుతున్నారా.. మీరు వింటున్నది నిజం. ప్రస్తుతం మహేష్‌తో భరత్ అనే నేను చిత్రాన్ని రూపొందిస్తున్న కొరటాల శివ ఈ సినిమా పూర్తి కాగానే అటు అల్లు అర్జున్, ఇటు రామ్ చరణ్‌లు రెడీగా ఉన్నారు. ఆ ఇద్దరి హీరోలకు ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదట. అయితే వీరిలో ఇద్దరినీ కాదని ఆయన నానితో సినిమా చేసేందుకు రెడే అవుతున్నాడట! తన దగ్గర ఉన్న మంచి స్టోరీ నానికి సరిపోతుందని భావించిన కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాను నానితోనే చేస్తాడని ఫిలిమ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయ. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.