వరుడి కోసం చిట్టా విప్పింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ క్రేజీ భామ కాజల్ ఈమధ్య కెరీర్ పరంగా స్పీడుమీదుంది. మూడు భాషల్లో ఆమె నటించిన సినిమాలు ఇప్పటికే మంచి సక్సెస్‌ను సాధించాయి. దాంతోకాస్త జోరు పెంచింది కూడా. ఇటీవల ఫిలిమ్‌ఫేర్ అవార్డుల వేడుకలో రెడ్‌కార్పెట్ పై హాట్‌హాట్‌గా తన అందాలతో చూపరులకు కనువిందుచేసి చర్చనీయాంశంగా మారిన కాజల్ అగర్వాల్ నటిగా మరిన్ని ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని వుందని, 15 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో చూశానని, నా జీవితం ఇలా వుండాలని ప్లాన్ చేసుకోలేద’ని సెలవిస్తోంది. ఈమధ్యే కాజల్ చెల్లెలు నిషా పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం ఆమె జ్యూయలరీ బిజినెస్ మొదలుపెట్టింది. దాన్ని దక్షిణాదిలో కూడా విస్తరించాలన్న ప్లాన్ చేస్తోంది కాజల్. ‘పెళ్ళి తరువాత కూడా నటించాలనుకుంటున్నాను. నటనకు ఎలాంటి అడ్డంకులు చెప్పనివాడు దొరికితే అప్పుడు పెళ్ళి చేసుకుంటా, గ్లామర్ విషయంలో ఎలాంటి పట్టింపులు లేవు. ఎలాంటి కాస్ట్యూమ్స్‌లో కనిపించడానికైనా సిద్ధమే. నా అభిరుచులు, ఆకాంక్షలకు అడ్డు చెప్పని వరుడి కోసం ఎదురుచూస్తున్నా..’అని పెద్ద చిట్టానే విప్పింది.