విజయ్ దేవరకొండ హీరోగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు చిత్రం ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ దేవరకొండ మలి చిత్రం అర్జున్‌రెడ్డితో వరల్డ్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం రెండు చిత్రాలతో ఇంతటి క్రేజ్‌ని, పాపులారిటీనీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా, మెహరీన్ హీరోయిన్‌గా ‘ఇంకొక్కడు’ ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో సూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా తెలుగు, తమిళ్‌లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.14 చిత్రం నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు, బివిఎస్‌ఎన్ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, స్వప్నదత్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్, సందీప్‌రెడ్డి వంగ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మెహరీన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, సందీప్ రెడ్డి వంగ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా మాట్లాడుతూ- అర్జున్‌రెడ్డి మూవీ ఐదుసార్లు థియేటర్‌లో చూశాను. విజయ్ దేవరకొండ అమేజింగ్ యాక్టర్. స్టూడియో గ్రీన్ బేనర్‌లో ఫస్ట్‌టైమ్ తెలుగు సినిమా విజయ్ దేవరకొండతో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కథకి విజయ్ అయితే కరెక్ట్‌గా యాప్ట్ అని నమ్మి సినిమా తీస్తున్నా. మార్చి 8 నుండి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో చేసి సెకెండ్ షెడ్యూల్‌లో చెన్నైలో చేస్తాం అన్నారు. దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ- విక్రమ్‌తో ‘ఇంకొక్కడు’ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నాను. చెన్నైలో అర్జున్‌రెడ్డి సినిమా చూశాను. బాగా వచ్చింది. ఆ సినిమా అన్ని భాషల్లో మంచి హిట్ అయింది. తను ఈ స్క్రిప్ట్ విని ఎగ్జైట్ అయ్యాడు. తమిళ్ నేర్చుకొని డైలాగ్స్ చెబుతా అన్నాడు. చాలా ప్యాషనేటెడ్ హీరో. జ్ఞాన్‌వేల్ రాజా బిగ్ ప్రొడ్యూసర్. సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రం వుంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సి.ఎస్.శ్యాం, కెమెరా:శాంత, ఆర్ట్:కిరణ్, కాస్ట్యూమ్స్ డిజైనర్:శ్రావ్య, దర్శకత్వం:ఆనంద్ శంకర్, నిర్మాత: కె.ఇ.జ్ఞాన్‌వేల్ రాజా.